13
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
దేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు శనివారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది భారీ ఊరటనిచ్చే వార్తగా మారింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు క్షీణించినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
శనివారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 నుంచి రూ.550 వరకు తగ్గుదల నమోదైంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు
హైదరాబాద్
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060
- నిన్నటి ధర రూ.1,59,490
- ఒక్కరోజులో రూ.430 తగ్గుదల
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,800
- నిన్నటి ధర రూ.1,46,200
- రూ.400 తగ్గింది
చెన్నై
- 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,60,690
- నిన్నటి ధర రూ.1,61,240
- రూ.550 తగ్గింది
- 22 క్యారెట్ల ధర రూ.1,47,300
- నిన్నటి ధర రూ.1,47,800
- రూ.500 తగ్గుదల
బెంగళూరు
- 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,060
- 22 క్యారెట్ల ధర రూ.1,45,800
ఢిల్లీ
- 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,59,210
- నిన్నటి ధర రూ.1,59,640
- రూ.430 తగ్గింది
- 22 క్యారెట్ల ధర రూ.1,45,950
- నిన్నటి ధర రూ.1,46,250
- రూ.300 తగ్గుదల
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షలు
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.95 లక్షలు
- చెన్నైలో కిలో వెండి ధర రూ.2.95 లక్షలు
- బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.85 లక్షలు
