Spirit: సందీప్ వంగా.. ఫ్లాన్ మాములుగా లేదుగా

by filmibuzz.com
21 views
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 60 రోజుల లాంగ్ షెడ్యూల్, పోలీస్ పాత్రలో ప్రభాస్ లుక్, రిలీజ్ డేట్‌పై తాజా అప్‌డేట్ ఇదే.

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాహుబలి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ కెరీర్‌ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని విభజించడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పటి నుండి పాన్ ఇండియా స్టార్‌గా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. సలార్, కల్కి 2898 AD చిత్రాలతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు డార్లింగ్. అయితే ఇప్పుడు అందరి కళ్లు కేవలం ఒకే ఒక సినిమాపై ఉన్నాయి.. అదే స్పిరిట్ (spirit).

సినిమాతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ( sandep reddy) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటమే దీనికి ప్రధాన కారణం

సందీప్ రెడ్డి వంగా సినిమా అంటేనే ఒక ఎమోషనల్ అండ్ వయోలెంట్ రైడ్. అలాంటి దర్శకుడు మన ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి లోకమంతా ఉంది. స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు.

ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్‌లో పోలీస్ రోల్ చేయకపోవడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రస్తుతం ప్రభాస్ డైరీ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయన ఇప్పుడు మూడు పడవల ప్రయాణం చేస్తున్నారు. నిజానికి స్పిరిట్ కోసం సందీప్ వంగా బల్క్ కాల్షీట్స్ అడిగారు. కానీ అనుకోని కారణాల వల్ల స్పిరిట్‌ సినిమాతో పాటు, ఫౌజీ సినిమా షూటింగ్ కూడా చేస్తుండడంతో పాటు, కల్కి సీక్వెల్‌కు సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కూడా చేయాల్సి వస్తుందట. దీంతో ప్రభాస్‌ మూడు పడవల ప్రయాణం చేయాల్సి వస్తుంది.

తాజా సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం ఒక భారీ ప్లాన్ సిద్ధం చేశారు. త్వరలో ఏకధాటిగా 60 రోజుల పాటు ఒక లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క షెడ్యూల్‌తోనే సినిమాకు సంబంధించిన మేజర్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. సందీప్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కంటే కంటెంట్ అండ్ ఎమోషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం వృథా కాదు. ఇది సినిమాకు పెద్ద ఊరటనిచ్చే విషయం.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు అసలైన కిక్ ఇచ్చే అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్. వచ్చే ఏడాది మార్చి 5న ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిరిట్ ను థియేటర్లలోకి తీసుకురావాలని సందీప్ వంగా పక్కా పకడ్బంధీగా ఉన్నారు. ప్రభాస్ కటౌట్‌కు, వంగా మార్క్ టేకింగ్ తోడైతే వెండితెరపై విద్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి రా అండ్ రస్టిక్ పోలీస్ గా ప్రభాస్ చేసే ఆ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Related Posts

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.