ఆర్బీఐ నుంచి బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి కొత్త సౌకర్యాలు అమలు

by filmibuzz.com
20 views

ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్

బ్యాంక్ కస్టమర్లకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. లోన్ రికవరీ పేరుతో కస్టమర్లను వేధిస్తున్న ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరించడం, అనుచితంగా ప్రవర్తించడం, మానసిక ఒత్తిడి కలిగించడం వంటి ఘటనలు పెరిగాయి. దీనిపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇకపై రికవరీ పేరుతో వేధింపులు చేస్తే బ్యాంకులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లోన్ రికవరీ సమయంలో మర్యాదపూర్వక విధానాలను పాటించాలి. కస్టమర్ల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. రికవరీ ఏజెంట్ల పనితీరుపై బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అయితే ఈ నిబంధనల నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు ప్రస్తుతం మినహాయింపు ఇచ్చింది ఆర్బీఐ.

ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే భవిష్యత్తులో లోన్ రికవరీ వేధింపులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Related Posts

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.